“రాధే శ్యామ్” రిలీజ్ పై లేటెస్ట్ టాక్.!

Published on Jun 11, 2021 6:14 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ వింటేజ్ వండర్ ఫుల్ లవ్ స్టోరీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ కరోనా వేవ్స్ లేకపోతే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ ఏడాది జూలై కి కూడా డౌట్ లానే ఉంది.

అయితే మరి ఈ గ్యాప్ లోనే ఈ చిత్రం విడుదల ఎప్పుడు అన్న దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ వర్గాలు మాత్రం దసరా రేస్ లో ఈ చిత్రం నిలవొచ్చని టాక్ చెప్పగా ఇదే రిలీజ్ పై మరో లేటెస్ట్ టాక్ బయటకు వచ్చింది.

ఇప్పుడు మీద పరిస్థితులు బెటర్ గా ఉంటే కనుక ఆగష్టులో ఈ చిత్రం విడుదల ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ టాక్ ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఇంకొన్ని రోజులు మాత్రమే రీషూట్ ఈ చిత్రానికి బ్యాలన్స్ ఉంది.

సంబంధిత సమాచారం :