లేటెస్ట్..మెగాస్టార్ నెక్స్ట్ లో ఈ స్టార్ట్ హీరోయిన్ ఫిక్స్!

Published on Aug 15, 2021 1:31 pm IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య” ఇంకా జస్ట్ కొంతమేర షూట్ బాలన్స్ మాత్రమే ఉంచుకోగా మెగాస్టార్ దీని తర్వాత మరో భారీ చిత్రం “లూసిఫర్” ని ట్రాక్ లో పెట్టేసారు. మరో గత రెండు రోజులు కితమే సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ అయిన ఈ చిత్రం ఎనలేని అంచనాలు నెలకొల్పుకుంది. అయితే మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇపుడు అధికారిక క్లారిటీ ఒకటి వచ్చింది.

ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార ఫిక్స్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులు నుంచి ఈ టాక్ ఉండగా ఇప్పుడు అది ఫైనల్ అయ్యింది. ఇక అధికారికంగా ఆహ్వానించడమే తరువాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మరో సెన్సేషనల్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించనున్నారని సాలిడ్ బజ్ కూడా స్టార్ట్ అయ్యింది మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :