లేటెస్ట్..”వీర సింహా రెడ్డి” రిలీజ్ డేట్ టైం ఫిక్స్.!

Published on Dec 3, 2022 11:53 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మాస్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అయితే మాస్ లో భారీ అంచనాలు నెలకొనగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని అందించారు.

ఈరోజు మధ్యాహ్నం అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ ని 2 గంటల 44 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ గా మాస్ అనౌన్సమెంట్ ని అందించారు. మరి ఆల్రెడీ సంక్రాంతి రేస్ లో ఈ సినిమాకి లాక్ చెయ్యగా మేకర్స్ అయితే ఇప్పుడు ఆ డేట్ ఏంటి అనేది రివీల్ చేయనున్నారు. మరి ఇదెప్పుడో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :