ఇప్పుడు టాలీవుడ్ లో భారీ హైప్ ని సెట్ చేసుకున్న అవైటెడ్ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో చేయనున్న సెన్సేషనల్ సీక్వెల్ సినిమా ఓజి 2 కూడా ఒకటి. గతంలో ఓజి సినిమాకు ఎంత లెవెల్ హైప్ ఉందో దానికి మించి ఎన్నో రెట్లు పార్ట్ 2 పై హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ నుంచే సినిమా అప్డేట్ రావడం, అతి త్వరలోనే షూట్ కూడా మొదలవుతుంది అని వచ్చిన రూమర్స్ క్రేజీగా మారాయి.
అయితే ఈ సినిమాపై లేటెస్ట్ ట్విస్ట్ ఒకటి వినిపిస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం షూటింగ్ నవంబర్ నుంచే మొదలవుతుంది అనే మాటలో నిజం లేదు అని తెలుస్తోంది. మరో రెండు వారాల్లోపే సుజిత్ తన వెకేషన్ ని పూర్తి చేసుకొని రానుండగా వచ్చిన తర్వాత సినిమా కథ విషయంలో పవన్ తో డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. సో అప్పుడే షూటింగ్ ఎప్పటి నుంచి చేయాలి అనే క్లారిటీ కూడా డిసైడ్ అవుతుంది అజీ టాక్. సో ఇంకొన్ని వారాల్లో ఓజి 2 పై ఓ క్లారిటీ బయటకు రావచ్చు.


