మహేష్ – రాజమౌళి భారీ సినిమాకి ఇంకా ఈ వర్క్ అవ్వలేదా.?

మహేష్ – రాజమౌళి భారీ సినిమాకి ఇంకా ఈ వర్క్ అవ్వలేదా.?

Published on Jul 5, 2022 10:00 AM IST


మన టాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్ అండ్ ఓన్లీ సెన్సేషనల్ కాంబో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబో అని తెలిసిందే. ఈ ఇద్దరి నుంచి సినిమా వస్తే చూడాలి అనేది దాదాపు దశాబ్దానికి పైగా అందరిలో మదిలో ఉన్న మాట.

అయితే ఈ చిత్రం ఎలాగో ఇప్పుడు ఉందని కన్ఫర్మ్ కాగా ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా చాలా సమయమే ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమా లైన్ ఏంటి అనే దానిపై చాలానే రూమర్స్ వినిపించాయి కానీ ఫైనల్ గా ఒక ఫారెస్ట్ నేపథ్యం లాక్ అయ్యిందని తెలిసింది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా నాయతకి వచ్చిన టాక్ ప్రకారం అయితే ఇంకా రాజమౌళి మరియు రచయితా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ లు సినిమా లైన్ ఏంటి అనేది ఇంకా లాక్ చెయ్యలేదట. మహేష్ కి ఎలాంటి సినిమా కరెక్ట్ గా ఉంటుంది అనేది ఇంకా చర్చ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సెన్సేషనల్ కాంబోలో అయితే సినిమా ఎలాంటి వస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు