బిగ్‌బాస్ సీజన్ 5పై అదిరిపోయే అప్డేట్..!

Published on Aug 13, 2021 11:00 pm IST

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ఆలస్యమైన ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇటీవల ఐదో సీజన్‌ లోగోకి సంబంధించి ప్రోమోను రిలీజ్ చేసిన నిర్వాహకులు మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్‌ 15న ఈ సీజన్‌కి సంబంధించి ఓ ప్రోమోను విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రోమోకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయ్యిందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక కూడా దాదాపు పూర్తయ్యిందని, ఆగస్ట్‌ 22 నుంచి హౌస్‌లోకి వెళ్లబోయే కంటెస్టెంట్లందరిని క్వారంటైన్‌కు పంపించబోతున్నారని, క్వారంటైన్ ముగిసాక వారందరిని సెప్టెంబర్‌ 5న నేరుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపనున్నారట. ఇదే కాకుండా రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తైన వారినే హౌస్‌లోకి పంపిస్తున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :