“రాజ రాజ చోర” నుంచి లేటెస్ట్ అప్డేట్..!

“రాజ రాజ చోర” నుంచి లేటెస్ట్ అప్డేట్..!

Published on Jul 27, 2021 1:05 AM IST

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరో శ్రీ విష్ణు హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన్ మేఘా ఆకాశ్ నటిస్తుండగా, గంగవ్వ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టైటిల్ సాంగ్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. జూలై 28 సాయంత్రం 4:05 నిమిషాలకు “ది చోర” అనే సాంగ్ రాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు