లేటెస్ట్..”ఆచార్య” ఇంకా ఇన్ని రోజులే బ్యాలన్స్.!

Published on May 23, 2021 8:32 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ సినిమా తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రంలోనే మెగాస్టార్ తో పాటుగా అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు.

అయితే లాక్ డౌన్ కారణంగా గత ఏడాది లేట్ గానే మొదలైన చిత్రం నవంబర్ నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంది అని దర్శకుడు కొరటాల శివ లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. అలాగే ఈ చిత్రంలో ఇంకా కేవలం పది నుంచి పన్నెండు రోజులు షూట్ మాత్రమే మిగిలి ఉందని కూడా కన్ఫర్మ్ చేసారు.

సో ఇప్పుడు పరిస్థితులు సెట్టయ్యాక అది కూడా ముగించేసి సినిమా విడుదలకు తీసుకురావడం ఖరారు అయ్యిందని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :