“ఆదిపురుష్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 20, 2021 9:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న బై లాంగువల్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం షూట్ శరవేగంగా జరుగుతుంది.

మోషన్ క్యాప్చర్ పనులు నుంచి ప్రభాస్ పై షాట్స్ కూడా తెరకెక్కుతున్నాయి. కొన్ని రోజుల కితమే కొంత మేర షూట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ చిత్రంలో రాముని పాత్రలో నటిస్తున్న ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ షూట్ కోసం ముంబై లో ల్యాండ్ అయ్యినట్టు తెలుస్తుంది.. అలాగే ఈ షూట్ వచ్చే ఏప్రిల్ మొదటి వారం వరకు జరగనుందట.

మరి ప్రభాస్ తో పాటు ఇంకా ఎవరు పాల్గొంటారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రంలో రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా సీతగా కృతి సనన్ ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. అలాగే ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :