సంక్రాంతి సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ఉండే ఆసక్తే వేరు. తెలుగు ప్రజల పెద్ద పండుగలో సినిమా కూడా ఒక భాగం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పండుగ దినాలలో ఫ్యామిలీ మొత్తం ధియేటర్ కి వెళ్లి సినిమా చూడటం ఒక సరదా.ఇక ఫ్యామిలీచిత్రాలకైతే ఈ పండుగ సమయంలో ఉండే క్రేజే వేరు. అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే వస్తున్నాడు అల్లువారబ్బాయి అల్లు అర్జున్. ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన కథలకు కమర్షియల్ అంశాలు జోడించి తీయడంలో త్రివిక్రమ్ మంచి దిట్ట. మరి అలాంటి దర్శకుడు బన్నీ తో చేస్తున్న అలవైకుంఠపురంలో మూవీపై భారీ అంచనాలను ఉన్నాయి.
ఇక వరుసగా పాటలు విడుదల చేస్తూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇక ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. చిత్రంలోని ప్రధాన నటులైన మురళి శర్మ, పూజా హెడ్డే గత రెండు రోజులుగా ఈ చిత్ర డబ్బింగ్ లో పాల్గొంటున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో నిర్మాణాంతర కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12 న అలవైకుంఠపురంలో మూవీ విడుదల కానుంది.


