“పుష్ప” షూట్ లో వారిపై కీలక సన్నివేశాలు.!

Published on Apr 22, 2021 11:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పవర్ ప్యాకెడ్ మాస్ మసాలా చిత్రంపై ఎనలేని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బన్నీ మరియు సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ పైగా పాన్ ఇండియన్ చిత్రం కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ప్రస్తుతం మేకర్స్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న టాలెంటెడ్ నటుడు ఫహద్ పై పలు కీలక సన్నివేశాలు తీసారట. అలాగే ఫహద్ తో పాటుగా రీసెంట్ గానే షూట్ లో జాయిన్ అయిన గ్లామరస్ యాంకర్ అనసూయపై కూడా కొన్ని కీలక సన్నివేశాలను సుకుమార్ తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

ఇది వరకే సుకుమార్ లాస్ట్ “రంగస్థలం” లో స్ట్రాంగ్ రోల్ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ప్రెజెంట్ చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :