పుష్ప పై వస్తోన్న రూమర్స్ కి క్లారిటీ !

Published on Jul 10, 2021 10:18 pm IST

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రానున్న ‘పుష్ప’ సినిమాలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోందని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. అలాగే అనసూయ కూడా ఈ సినిమా నుండి తప్పుకుందని రూమర్ పుట్టించారు. కానీ అనసూయ ఈ సినిమాలో నటిస్తోంది. ‘పుష్ప’ చిత్రంలో అనసూయ కోసం సుకుమార్ ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేయించాడు. ‘

ఆమెది బలమైన గిరిజన మహిళ పాత్ర అట. పుష్ప కథని మొత్తంగా మలుపు తిప్పే పాత్ర అట ఆమెది. ఇక గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో మరో స్పెసల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ నటిస్తోంది.

అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :