‘పుష్ప’ కోసం కూడా అలాగే చేస్తోన్నాడట !

Published on Jan 25, 2021 6:14 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. దాంతో ఈ సినిమాలో షూటింగ్ పార్ట్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాలీ. అయితే, లాంగ్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ అడవుల్లోకి వెళ్లి తీస్తున్నా.. కొన్ని క్లోజ్ షాట్స్ అండ్ ఇన్ డోర్ సీన్స్ మాత్రం హైదరాబాద్ లోనే తియబోతున్నారు.

అందుకు కోకాపేట ఏరియాలో సెట్ నిర్మాణం చేపట్టారని తెలుస్తోంది. సుకుమార్ రంగస్థలం సినిమాకి కూడా ఇలాగే సెట్ వేయించి షూట్ చేశారు. ఇప్పుడు పుష్ప కోసం కూడా రంగస్థలంనే ఫాలో అవుతున్నాడు సుకుమార్. ఇక వచ్చే షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసింది చిత్రబృందం.

అలాగే ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కోసం మంచి హీరోను వెతుకుతుంది టీమ్. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :