ఏ ఆర్ రెహమాన్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్!

ఏ ఆర్ రెహమాన్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్!

Published on Mar 16, 2025 3:02 PM IST

ఇండియన్ సినిమా దగ్గర తన సంగీతంతో మొత్తం అన్ని భాషల ఆడియెన్స్ కి కదిలించిన అతి కొద్ది మంది సంగీత దర్శకుల్లో ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ కూడా ఒకరు. మరి రెహమాన్ ఇపుడు పాన్ ఇండియా భాషల్లో పలు ప్రాజెక్ట్ లు కూడా చేస్తున్నారు. వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న భారీ చిత్రం కూడా ఒకటి కాగా రెహమాన్ పై ఒక ఊహించని వార్త లేటెస్ట్ గా వచ్చింది. తా

ను అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్టుగా వచ్చిన వార్తలు కొంచెం ఖంగారు పెట్టాయి. అయితే రెహమాన్ డీహైడ్రేషన్ కి లోను కావడంతో అనారోగ్యం పాలయ్యారు. ఇలా అపోలో హాస్పిటల్ లో తాను జాయిన్ కాగా అక్కడ నుంచి లేటెస్ట్ గానే రొటీన్ చెకప్ అనంతరం డిశ్చార్జ్ అయినట్టుగా అపోలో వారు కన్ఫర్మ్ చేశారు. దీనితో రెహమాన్ అభిమానులు ఇపుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు