బాలయ్య ‘అఖండ’ రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jul 12, 2021 11:04 pm IST

నటసింహం బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న అఖండ సినిమా‌ రిలీజ్ పై లేటెస్ట్ గా ఒక అప్ డేట్ తెలిసింది. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు అయితే మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు గాని, అక్టోబర్ లో సినిమా రిలీజ్ అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట.

ఇక ఈ సినిమా కోసమైతే నంద‌మూరి అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ జరుకోవాల్సి ఉంది. ఇక ఈ సినిమా టీజర్ కి 50 మిలియన్ల వ్యూస్ రావడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అన్నట్టు బోయపాటి, బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అదిరిపోయే యాక్షన్ ఉండాలని బాలయ్య ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటారు.

అందుకే ఈ సినిమా యాక్షన్ విషయంలో చాలా రకాలుగా ఆలోచించి ఫైట్స్ ను కంపోజ్ చేశారు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. ఇక ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

సంబంధిత సమాచారం :