బెల్లంకొండ కామెడీ చాల బాగా వచ్చిందట !

బెల్లంకొండ కామెడీ చాల బాగా వచ్చిందట !

Published on Apr 23, 2020 1:00 AM IST

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ గణేష హీరోగా ఇంట్రడ్యూజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. గతేడాది చివర్లో మొదలైన ఈ చిత్రం సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా ఇప్పటివరకూ షూట్ అయిన పార్ట్ ను ఎడిట్ చేశారట. అవుట్ ఫుట్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా బెల్లంకొండ గణేష్ పై కొన్ని కామెడీ సీన్స్ చాల బాగున్నాయని తెలుస్తోంది.

వాస్తవికతకు దగ్గరగా ఉండే సరికొత్త తరహా ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘రేసు గుర్రం, లక్ష్మీ, లక్ష్యం’ వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. ‘అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, ఆదిత్య వర్మ, ఫేమ్ రదన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు