‘మెగాస్టార్’ 152వ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Dec 2, 2019 10:44 am IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్ ను చిరంజీవినే స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. ఆయనతో పాటు మణి శర్మ, దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్‌ ల కోసం బ్యాంకాక్‌ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. డిసెంబ‌ర్‌ లో సినిమా షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారని.. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :

More