పవన్ ‘వీరమల్లు’ పై కొత్త అప్ డేట్ !

పవన్ ‘వీరమల్లు’ పై కొత్త అప్ డేట్ !

Published on Jun 4, 2023 11:04 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్ రీసెంట్ గా కాలిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సెట్ కి సంబంధించిన మరమ్మత్తుల పని పూర్తి అయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సెట్ లో షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ సీక్వెన్స్ లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కనిపించబోతుందని తెలుస్తోంది. ఆమె పాత్ర నెగిటివ్ అని, సినిమాలో కీలకమైన పాత్ర అని కొత్తగా రూమర్ వినిపిస్తోంది.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు