కింగ్ నాగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Aug 8, 2021 6:34 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా పలు ఆసక్తికర చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో చేస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగ్ కెరీర్ లోనే భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

భారీ హంగులతో ఇది వరకే కొంత మేర షూట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం షూట్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. చాలా లాంగ్ షెడ్యూల్ గా ప్లాన్ చేసిన దీనిలో మేకర్స్ నాగ్ సహా పలువురు కీలక నటులతో ఆసక్తికర సన్నివేశాలను తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

మరి ఈ షెడ్యూల్ కి సంబంధించి స్టైలిష్ ఫోటోనే నాగ్ ది బయటకొచ్చి వైరల్ అవుతుంది. గల్ పనాగ్ మరియు అనికా సురేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :