విష్ణు ఆశలన్నీ ‘మోసగాళ్లు’ పైనే !

Published on Feb 22, 2021 3:00 pm IST

మంచు విష్ణు హీరోగా వస్తోన్న కొత్త సినిమా ‘మోసగాళ్లు’. ప్రపంచంలోని అతిపెద్దదైన ఐటీ కుంభకోణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆత్యహదిక భాగం విదేశాల్లోనే షూటింగ్ జరిపారు. కాగా ఈసినిమా మార్చి 19న విడుదల కానుంది. అయితే ఈ మధ్య హాట్ లేక డీలా పడ్డ మంచు విష్ణు తన ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా విష్ణుకి హిట్ ను ఇస్తోందా ? చూడాలి.

సినిమా అయితే చాల బాగా వచ్చిందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో రోబరికి సంబంధించి ఓ సీక్వెన్స్ అదిరిపోతుందట. పైగా యూనివర్సల్ స్టోరీతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేశాడు.

సంబంధిత సమాచారం :