మణికర్ణికలో ముఖ్య పాత్రలో టీవీ నటి !

Published on Dec 14, 2018 12:14 am IST

స్టార్ హిరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మణికర్ణిక:ది క్వీన్ అఫ్ ఝాన్సీ’. ఈచిత్రంలో సీరియల్ నటి అంకిత లోఖండే ,జహల్కారి బాయ్ అనే పాత్రలో నటిస్తుంది. ఈచిత్రంలో ఆమె రాణి లక్ష్మీ బాయ్ ఆర్మీ లో ఉమెన్ సోల్జర్ గా కనిపించనుంది. ఈ చిత్రంతో అకింత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ డిసెంబర్ 18న విడుదలకానుంది. ఇటీవల పలు వివాదాలతో వార్తల్లోకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు కాగా ఎన్టీఆర్ బయోపిక్ కోసం సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఈ చిత్రం నుండి ఆయన తప్పుకున్నారు. దాంతో కంగానా నే దర్శకురాలిగా మారి మిగతా చిత్రీకరణ ను పూర్తి చేస్తుంది.

భారీ బడ్జెట్ తో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 25న హిందీ తో పాటు , తెలుగు , తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :