‘లూసిఫర్’ స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు ?

Published on Apr 25, 2021 7:30 pm IST

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్, దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో కీలకమైన మార్పులను ఆల్ రెడీ చేసేశారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ తో దర్శకుడు మోహన్ రాజాకి మళ్ళీ రెండు నెలలు టైం దొరికింది. అందుకే మళ్ళీ స్క్రిప్ట్ మీద కూర్చున్నాడట. స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులను మోహన్ రాజా చేస్తున్నారని తెలుస్తోంది. ఆ మార్పులలో ముఖ్యమైనది ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేయడం.

కాకపోతే హీరోయిన్ పాత్ర నిడివి ఎంత ఉంటుందనేది ఇంకా తెలియలేదు. హీరోయిన్ ను సాంగ్ కు మాత్రమే పరిమితం చేస్తారా లేక సీన్స్ లో కూడా ఇన్ వాల్వ్ చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఇప్పటికే ఆ పాత్రలో ఇప్పుడు హీరో సత్యదేవ్ ను కనిపించబోతున్నాడు. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని చిరు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :