యంగ్ డైరెక్టర్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇస్తారా ?

Published on Jan 24, 2021 8:05 am IST

మెగాస్టార్ చిరంజీవి కోసం యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఒక ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే కథను రాశాడని.. ప్రస్తుతం చిరుకు కథను వివరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఎలాగూ మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, తన కథను ఓకే చేస్తాడనే వెంకీ ఆశ పడుతున్నాడట. మరి చూడాలి వెంకీ కథ.. మెగాస్టార్ కి నచ్చుతుందో లేదో. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్యతో పాటు మెహర్ రమేష్ సినిమాని చేస్తున్నారు. అలాగే మలయాళ ‘లూసిఫర్’ సినిమా కూడా చేస్తున్నారు.

కాగా చిరు రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలు ఒప్పుకుంటున్న నేపథ్యంలో చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కోసం కొత్త కథలు రాయడం మొదలెట్టారట. ఇప్పటికే చిరుకు కొంతమంది లైన్స్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఆచార్య షూట్ లో చిర ప్రస్తతం పాల్గొంటున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్‌ శివార్లలో వేసిన ఊరి సెట్ లో షూట్ జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :

More