టీజర్ రాబోతున్న సూపర్ స్టార్ సినిమా !

Published on Dec 8, 2018 9:56 am IST

జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మాలీవుడ్ సూపర్ స్టార్ ‘మోహ‌న్ లాల్‌’. ప్రస్తుతం ఆయన తెలుగులో కూడా తన మార్కెట్ ను పెంచుకున్నే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మోహన్ లాల్ నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి.

కాగా మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ‘ఒడియన్’. భారీ బడ్జెట్, అత్యుతమ సాంకేతిక విలువలతో రూపొందిన ఈ సినిమా నుండి ఈ రోజు టీజర్ రానుంది. సాయంత్రం 4 గంటలకు టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించగా సూపర్ పవర్స్ కలిగిన పాత్రలో మోహన్ లాల్ నటించారు. రామ్ దగ్గుబాటి, సంపత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :