మే సెకెండ్ వీక్ లో.. ‘ఒరేయ్‌ బుజ్జిగా’ ?

Published on Apr 2, 2020 10:29 pm IST

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’. కాగా కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ ను పోస్ట్ ఫోన్ చేసుకున్న ఈ సినిమా.. అన్ని కుదిరితే మే సెకెండ్ వీక్ లో విడుద‌ల‌ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. లక్ష్మీ కె.కె. రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకం పై ఏమైంది ఈ వేళ‌, బెంగాల్ టైగ‌ర్‌ వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌ గా కార్తి ఖైదీ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహ‌న్, ఆయన ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More