రెండు గెటప్స్ లో కనిపించనున్న ‘ప్రభాస్’ ?

Published on Apr 1, 2020 3:00 am IST

నేషనల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారట. పిరియాడిక్ నేపథ్యంలో వచ్చే ఓల్డ్ గెటప్ లో.. అదేవిదంగా ప్రస్తుత కాలానికి సంబంధించి మరో గెటప్ లో ప్రభాస్ కనిపిస్తాడట. ఇక రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ చిత్రం అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.

కాగా గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదించనున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ మాత్రమే కాకుండా మంచి రొమాంటిక్ కంటెంట్ కూడా ఉండనుంది. ఈ చిత్రానికి ‘జాన్’ అనే పేరుతో పాటు ‘ఓ డియర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం :

X
More