ఆదిపురుష్’లో మరో బాలీవుడ్ స్టార్ ?

Published on Feb 22, 2021 8:07 am IST

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. పైగా తన పాన్ ఇండియా సినిమాల్లో మిగిలిన కీలక నటీనటులను కూడా పాన్ ఇండియా స్టార్లునే తీసుకుంటున్నారు. కాగా ఈ క్రమంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’లో బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి దత్ కూడా నటించబోతున్నాడట. సునీల్ శెట్టి కూడా ఓ కీలక క్యారెక్టర్ చేయబోతున్నాడట. ఈ వార్త నిజమే అంటూ.. బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్ కూడా ఒకేసారి షూట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఈ ఏడాది పూర్తయ్యేనాటికి పూర్తి చేసి ఆ తరువాత నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. అంటే 2021 మొత్తం ప్రభాస్ కు రెస్ట్ అనేదే ఉండదని అర్థమవుతోంది. ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ దర్శకత్వంలో రానున్న ఈ “ఏ- ఆది పురుష్” సినిమా దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు నటిస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More