ప్రభాస్ “సలార్” షూట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Apr 20, 2021 11:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి అలాగే ఈ చిత్రం షూట్ కూడా పర్ఫెక్ట్ గా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

ఆల్రెడీ ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ నిమిత్తం గుజరాత్ లోని అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మాణం వహించి రెడీగా ఉంచారు. అలాగే రాధే శ్యామ్ రీ షూట్ లేకుంటే ఈ పాటికే సలార్ షూట్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఈ రెండు ప్లేసెస్ లో వచ్చే నెల హైదరాబాద్ షూట్ తో స్టార్ట్ చేయనున్నట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా హోంబలే నిర్మాణ సంస్థ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :