లేడీస్ కాలేజీ లెక్చరర్ గా రామ్ ?

లేడీస్ కాలేజీ లెక్చరర్ గా రామ్ ?

Published on Oct 2, 2022 10:05 PM IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో రామ్ లేడీస్ కాలేజీ లెక్చరర్ గా నటించబోతున్నాడని తెలుస్తోంది. పైగా రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అట.

ఇక ఈ సినిమాను కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడు. కాగా ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ అఖండ సినిమాతో బోయపాటి తన ఖాతాలో భారీ హిట్ ను వేసుకున్నాడు.

కాబట్టి.. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు