‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ లో మళ్ళీ మార్పులు ?

Published on May 9, 2021 10:32 pm IST

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ ఇంకా ఉంది. ఎప్పటికీ సాధారణ పరిస్థితులు వస్తాయో ఇప్పుడే చెప్పలేం అంటూ చేతులెత్తేస్తున్నారు అధికారులు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలన్నీ మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వక తప్పదు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ కూడా పోస్ట్ ఫోన్ అయింది. అయితే, రిలీజ్ డేట్ లో చిత్రబృందం మళ్ళీ కొత్త ఆలోచన చేస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారట.

ఇక ఈ సినిమాలో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా నటిస్తున్నారు. అదేవిధంగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటి సారి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి ఇండియా వైడ్ గా బజ్ ఉంది. ఇక దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :