కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోస్ లో ఒకరైన శివ కార్తికేయన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు శివ కుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్స్ సాలిడ్ డివోషనల్ డ్రామా ‘సేయన్’. మన టాలీవుడ్ స్టార్స్ చేయాలనుకున్న కుమార స్వామి నేపథ్యంలో ముందే వీరు స్టార్ట్ చేసి సర్ప్రైజ్ చేశారు.
ఇలా కొన్ని నెలల కిందటే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నట్టు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ వారు రివీల్ చేశారు. ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా దీనిపై విడుదల చేసి ఫ్యాన్స్ కి అప్డేట్ అందించారు.
సో మొత్తానికి ఈ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతుంది అని చెప్పవచ్చు. ఇక అమరన్ తర్వాత కమల్ నిర్మాణంలో, శివ కార్తికేయన్ తో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
From passion to progress#Seyon First Schedule Wrapped
#சேயோன்#VetrivelVeeravel #Varendi#KamalHaasan #Sivakarthikeyan@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Dir_SivakumarM @Music_Santhosh #BhagyashriBorse @RKFI @turmericmediaTM @raichalrabecca @Actor_ArulDass @bala_actor pic.twitter.com/daiiv22Nvh
— Raaj Kamal Films International (@RKFI) June 10, 2026


