పెట్టిన డబ్బులు వెనక్కి రావటమే సక్సెస్ అంటా !

Published on Dec 14, 2018 4:00 am IST

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లగా వచ్చిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’ . శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం గుడ్ మౌత్ టాక్ ను సొంతం చేసుకోవడంతో రోజురోజుకు కలెక్షన్స్ కూడా పుంజుకుంటుంది. కాగా ఇప్పటికే ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద బ్రేక్ ఈవెన్ అయిందని సక్సెస్ మీట్ లో పాల్గొన్న చిత్రబృందం చెబుతుంది.

కాగా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న హీరో సుమంత్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సక్సెస్ అంటే నిర్మాత పెట్టిన డబ్బులు వెనక్కి రావటమే..ఆ పరంగా చూసుకుంటే మా “సుబ్రహ్మణ్యపురం” పూర్తిగా విజయం సాధించింది. మా నిర్మాత పెట్టిన డబ్బులు వచ్చేసాయి.. నాకు సంతృప్తి ని ఇచ్చింది ఈ సినిమా’ తెలిపారు.

సంబంధిత సమాచారం :