“సైరా” నుంచి బయటకొచ్చిన లేటెస్ట్ అప్డేట్..!

Published on Jul 16, 2019 2:28 pm IST

మొట్టమొదటి తెలుగు నేలకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రపై మెగాస్టార్ చిరంజీవి కథానాయకునిగా అలాగే నయనతార కథానాయకిగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ లాంటి అగ్ర నటుల కలయికలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. దాదాపు 200 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.అలాగే మెగాస్టార్ చాలా కాలం తర్వాత ఒక ఫాంటసీ చిత్రంలో నటిస్తుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.కానీ ఇప్పటికే షూటింగ్ వర్క్ ను కూడా ముగించేసుకున్న ఈ చిత్రంకు సంబంధించి ఏ విషయం కూడా బయటకు రావడం లేదు.

దీనితో మెగాభిమానులు ఏదైనా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ మధ్యనే సైరా టీమ్ ఒక్కొక్కటిగా అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెడుతుందని అందులో భాగంగా చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోలను అతి త్వరలోనే విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి.ఇప్పుడు మళ్ళీ తాజాగా దీనికి సంబంధించి మరో మెగా న్యూస్ బయటకు వచ్చింది.సైరా నుంచి మేకింగ్ వీడియో అయితే పూర్తయ్యిందని ఆ వీడియో ఈ వారంలోనే రామ్ చరణ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడుదల చేస్తారని బజ్ వినిపిస్తుంది.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న విడుదల అవ్వనుంది అని అనధికారిక వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More