రజినీ “అన్నాత్తే” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

రజినీ “అన్నాత్తే” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jul 31, 2021 2:01 PM IST

ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ “అన్నాత్తే” అనే సాలిడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. అక్కడ స్టార్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూట్ ఇప్పటి వరకు పలు కారణాల చేత అలా వాయిదా పడుతూ వచ్చింది. కానీ మళ్ళీ ఎట్టకేలకు రజినీ షూట్ ని స్టార్ట్ చేసి ఫినిష్ చేసే పనిలో ఉండగా ఈ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

ఈ చిత్రంలో ఇంకా కొన్ని రోజుల వ్యవధిలోనే షూట్ బ్యాలన్స్ ఉందట. అది అయ్యిపోతే షూట్ అంతా కంప్లీట్ అయ్యిపోయినట్టే అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో రజినీ సరసన నయనతార నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు