ఆగస్టు రెండో వారం సినిమాల పరిస్థితి ఏమిటి ?

Published on Aug 9, 2021 3:35 pm IST

కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో జూన్‌ చివరి వారం నుండి థియేటర్లు తెరుచుకున్నాయి. మొదటి వారం ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత వారం ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’తో పాటు ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే ఉత్సాహంతో ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో చూద్దాం.

ముందుగా ‘కనబడుట లేదు’ సునీల్‌ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే డబ్బింగ్ మూవీ సిద్ధార్థ్‌ ‘ఒరేయ్‌ బామ్మర్ది’ ఆగస్టు 13నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘సుందరి’గా అలరించడానికి పూర్ణ కూడా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే విభిన్న కథలతో సినిమాలు చేసే హీరో విష్వక్‌సేన్‌, కథానాయకుడిగా నరేశ్‌ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పాగల్‌’. ఈ సినిమాని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

సంబంధిత సమాచారం :