“ఉస్తాద్ భగత్ సింగ్” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Mar 24, 2023 10:31 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు ఓ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతూ ఉండగా ఈ షూటింగ్ కోసం పవన్ 22 రోజులు మేర డేట్స్ కేటాయించగా ఇది ఆల్ మోస్ట్ కంప్లీట్ కావస్తుంది. ఇక తన ఎన్నికల ప్రచారం లోపు అయితే మిగతా సినిమాలు కూడా పైప్ లైన్ లో పెట్టుకొని శరవేగంగా కంప్లీట్ చేయాలని చూస్తున్న పవన్ ఇప్పుడు అయితే నెక్స్ట్ గా “ఉస్తాద్ భగత్ సింగ్” ని స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.

దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ మంచి అంచనాలు నెలకొల్పుకోగా దీనిపై లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ని అయితే మేకర్స్ ఈ ఏప్రిల్ 5 నుంచి స్టార్ట్ చేయనున్నట్టుగా ఫిక్స్ చేశారట. మరి ఆల్రెడీ ఈ సినిమాకి మేకర్స్ భారీ సెట్టింగ్ పనులు చేస్తున్న సంగతి తెలిసిందే. షూట్ కి సంబంధించి అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :