లెజెండరీ క్రికెటర్ రాక అప్పుడే !

Published on May 24, 2021 11:13 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ వస్తోన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాగా అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాని జులై లాస్ట్ వీక్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పటిలోపు కరోనా సెకెండ్ వీక్ తగ్గుతుందని చిత్రబృందం ఆశిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్స్ ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చాయి. దాంతో జులైలో రిలీజ్ అవుతుందో లేదో అంటూ కపిల్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. ఇక 83 అనే టైటిల్ తో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? అలాగే కపిల్ జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటి ? వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది.

సంబంధిత సమాచారం :