నిన్న నిఖిల్, లావణ్య త్రిపాఠీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన అర్జున్ సురవరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి అతిధిగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరు కావడంతో హీరో నిఖిల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంత వరకు నేను చిరంజీవి గారికి నేను అభిమానిని మాత్రమే.. నేటి నుండి భక్తుడిని ఆయన చెప్పడం ఆసక్తిని రేపింది.
ఇక చిరంజీవి మాట్లాడుతూ.. చిత్ర దర్శక నిర్మాతలపై ప్రసంశలు కురిపించారు. ప్రేమాభిమానాలే బ్యాంకు బాలన్స్ గా భావించే నాకు, నిఖిల్ అభిమానంతో నా బ్యాంకు బాలన్స్ పెరిగింది అని చెప్పుకొచ్చారు. ఐతే హీరోయిన్ లావణ్య పై ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపాయి. లావణ్య లో నాకు నచ్చిన అంశం ఆమె చొట్ట బుగ్గలు. ఆ చొట్ట బుగ్గలతో ఆమె చేసే క్యూట్ యాక్టింగ్ భలే ఉంటుంది. అలాగే దర్శకుడు మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ చిత్రంలో ఆమె చాలా బ్యూటిఫుల్ గా కనిపించారు అని చెప్పుకొచ్చారు. ఇక మెగాస్టార్ లాంటి వారు ఇచ్చిన కాంప్లిమెంట్ కి లావణ్య ఉబ్బి తబ్బిబై పోతుందిట. అర్జున్ సురవరం మూవీ ఈనెల 29న విడుదల అవుతుంది.


