మనోజ్‌ సినిమాలో హోమ్లీ హీరోయిన్ ?

మనోజ్‌ సినిమాలో హోమ్లీ హీరోయిన్ ?

Published on Jul 26, 2021 9:01 PM IST

హీరో మంచు మనోజ్‌ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ అనే కొత్త సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హోమ్లీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ కీలక పాత్రలో నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఆమెది జర్నలిస్ట్ పాత్ర అట. సినిమాలో సెకండ్ హాఫ్ లో లావణ్య పాత్ర ఎంటర్ అవుతుందట. ఇక ఈ సినిమాలో కనిపించే కొత్త లుక్ కోసం మనోజ్ బాగా వర్కౌట్స్ చేశాడట.

కాగా ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్. కాగా ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా కోసం ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు