మెగా హీరో సినిమాలో లావణ్య త్రిపాఠి ?

మెగా హీరో సినిమాలో లావణ్య త్రిపాఠి ?

Published on Apr 9, 2018 9:43 AM IST


మెగా హీరో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ హిట్ తర్వాత చేస్తున్న సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ నెల ఆఖరి వరం నుండి మొదలుకానుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన కథానాయకిగా లావణ్య త్రిపాఠి నటించనుంది.

గతంలో వరుణ్, లావణ్యలు కలిసి ‘మిస్టర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే అంతరిక్షం నైపథ్యంలో సాగే సైన్టిఫిక్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరి కూడ మరొక హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ హైదరాబాద్లో భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. జాగర్లమూడి సాయిబాబ, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు