కేవలం 2 వారాలకే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మెగా కోడలి లేటెస్ట్ సినిమా!

కేవలం 2 వారాలకే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మెగా కోడలి లేటెస్ట్ సినిమా!

Published on May 20, 2026 8:15 AM IST

Sathi-Leelavathi

రీసెంట్ గానే విడుదల అయ్యిన టాలీవుడ్ చిత్రాల్లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల హీరోయిన్ గా దేవ్ మోహన్ హీరోగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’ కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని భీమిలి కబడ్డీ జట్టు దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఈ సమ్మర్ లో నడుస్తున్న డ్రై సీజన్ లో విడుదల కాగా థియేటర్స్ లో అనుకున్న రేంజ్ రెస్పాన్స్ అందుకోలేదు.

ఇలా ఇప్పుడు థియేటర్స్ లో నుంచి కేవలం రెండే వారాల్లో ఓటిటిలో స్ట్రీమింగ్ కి ఈ చిత్రం వచ్చేసింది. ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ రోమ్ కామ్ సినిమా చూడాలి అనుకుంటే సన్ నెక్స్ట్ లో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా నాగ మోహన్ బాబు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు