లావణ్యా త్రిపాఠి ట్విట్టర్‌ వేదికగా ‘సెబాస్టియన్‌ పి.సి. 524’ గ్లింప్స్‌ విడుదల

లావణ్యా త్రిపాఠి ట్విట్టర్‌ వేదికగా ‘సెబాస్టియన్‌ పి.సి. 524’ గ్లింప్స్‌ విడుదల

Published on Dec 26, 2020 9:00 AM IST

sebn

‘రాజావారు రాణివారు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న మూడో చిత్రం ‘సెబాస్టియన్‌ పి.సి. 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రమోద్‌, రాజు నిర్మిస్తున్నారు. నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యంలోని కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. క్రిస్మస్‌ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా కథానాయిక లావణ్యా త్రిపాఠి ఈ సినిమా గ్లింప్స్‌ విడుదల చేశారు. గేటు దగ్గర్నుంచి వెళుతూ చర్చిని, తర్వాత జీసస్‌ను చూపించి, ఆ తర్వాత హీరో కిరణ్‌ అబ్బవరాన్ని చూపించడం, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్లింప్స్‌లో ‘ఓ తల్లికి న్యాయం జరగడం కోసం మరో తల్లి చేసిన ప్రామిస్‌’, ‘నిజం ఎప్పటికీ దాగదు’ వంటి కోట్స్‌ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నాయి.

జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘సాహో’ తర్వాత ఆయన సంగీతం అందిస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. సినిమా కథతో పాటు కొత్తగా ఏదైనా చేయాలని యూనిట్ సభ్యుల తాపత్రయం ఆయనకు నచ్చడంతో ఈ సినిమా అంగీకరించారు.
‘సెబాస్టియన్‌ పి.సి. 524’లో కిరణ్‌ అబ్బవరం రెండు లుక్స్‌లో కనిపించనున్నారని గ్లింప్స్‌ ద్వారా తెలుస్తోంది. మొదట గడ్డంతో కనిపించిన అతను, ఆ తర్వాత పోలీస్‌ డ్రస్‌లో క్లీన్‌ షేవ్‌తో కనిపించారు. సినిమాలో క్రిస్మస్‌ రోజున జన్మించిన క్రిస్టియన్‌ యువకుడు సెబాస్టియన్‌గా కిరణ్‌ అబ్బవరం కనిపించనున్నారు. అందుకని, గ్లింప్స్‌ చివర ‘హ్యాపీ బర్త్‌డే సెబా’ అని పేర్కొన్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు