పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటున్న లారెన్స్ ‘రుద్రుడు’ గ్లింప్స్ టీజర్

పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటున్న లారెన్స్ ‘రుద్రుడు’ గ్లింప్స్ టీజర్

Published on Oct 29, 2022 10:15 PM IST


కొరియోగ్రాఫర్ కం యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా కథిరేసన్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ మూవీ రుద్రుడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అందరిలో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ మూవీని ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్ బ్యానర్‌ పై కథిరేశన్‌ స్వీయ నిర్మాణంలో గ్రాండ్ లెవెల్లో రూపొందిస్తున్నారు. రాఘవ లారెన్స్‌కు జోడీగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి జీ.వి ప్రకాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ని నేడు లారెన్స్ బర్త్ డే సందర్భంగా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు.

కొందరు రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తుండడం, వారిని తన కత్తితో లారెన్స్ రౌద్రంతో అంతమొందించడం వంటి యాక్షన్ సన్నివేశాలతో ఈ గ్లింప్స్ టీజర్ రూపొందింది. ఇక టీజర్ లో లారెన్స్ యాంగ్రీ స్టైల్, లుక్స్ బాగున్నాయి. అలానే ఫోటోగ్రఫి తో పాటు జివి ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ లో బాగుంది. మొత్తంగా ఈవిల్ ఈజ్ నాట్ బార్న్ ఇట్స్ క్రియేటెడ్ అనే కాన్సెప్ట్ తో పవర్ఫుల్ గా రూపొందిన రుద్రుడు టీజర్ ఆడియన్స్ లో మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచింది అనే చెప్పాలి. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావించిన యూనిట్, మూవీకి సంబంధించి వీఎఫ్‌ఎక్స్ పనులు కొంత ఆలస్యం కారణంగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో దీనిని రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధమైంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు