ఇప్పటికి 156 గుండెలకు ఊపిరి పోసిన హీరో…!

Published on Jul 22, 2019 8:01 am IST

హీరో డైరెక్టర్,మరియు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ జీవితం చాలా మందికి స్ఫూర్తి దాయకం అని చెప్పాలి. చిన్న గ్రూప్ డాన్సర్ గా పరిశ్రమలోకి ప్రవేశించిన లారెన్స్ కొరియోగ్రాఫర్ గా హీరోగా,దర్శకుడిగా ఎదిగారు. నాగార్జున హీరోగా మాస్ చిత్రం తో డైరెక్టర్ గా మారిన ఈయన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు, ఆ తరువాత, డాన్, రెబెల్ చిత్రాలు తీశారు. “ముని” చిత్రంతో హారర్ కామెడీ చిత్రాల సిరీస్ ప్రారంభించి, “కాంచన” పేరుతో వరుస చిత్రాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు. ఇటీవల విడుదలైన “కాంచన” 3 కూడా తెలుగు తమిళ భాషలలో విజయం అందుకుంది.

కాగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లారెన్స్ సామజిక సేవలో ముందుంటారు. ముఖ్యంగా వారి తల్లిగారి పేరున ఓ ట్రస్ట్ స్థాపించి పేద పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నాడు. తన సంపాదనలో లారెన్స్ కొంత ఇలా సామజిక కార్యక్రమాల కొరకు కేటాయిస్తారు. కాగా ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో తను చేయించిన గుండె ఆపరేషన్స్ లో 156 వది కూడా విజయవంతం అయినదని ఆనందం వ్యక్తం చేశారు. ఖరీదైన గుండె ఆపరేషన్స్ చేయించుకోలేని పిల్లల తల్లి తండ్రులకు లారెన్స్ చేస్తున్న సాయం అభినందనీయం. ప్రస్తుతం లారెన్స్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న కాంచన హిందీ రీమేక్ “లక్ష్మీ బాంబ్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More