తెరమీద తాను పనిచేసిన విభాగాల లిస్టు చాంతాడంత వేసుకోగల సమర్ధుడు లారెన్స్. హీరో, నృత్య దర్శకుడు, సంగీత దర్శకుడు, దర్శకుడు అన్ని విభాగాలలో ప్రవేశంవున్న లారెన్స్ ఇప్పుడు బిల్డర్ అవతారమెత్తాడు. ఆయన మాతృముర్తికి జ్ఞాపకార్ధంగా చెన్నై శివార్లలో ఒక గుడిని కట్టే ప్రయత్నం చేస్తున్నాడు
తమిళనాడులో మనుషులకు గుడికట్టడం అన్నది సర్వసాధారణ విషయం. కుష్బూ, జ్యోతిక వంటి నటీమనులకు అభిమానులు ఏనాడో గుళ్ళు కట్టేశారు.
ఈ గుడి నిర్మాణంతో లారెన్స్ మరింత క్రేజ్ ని సంపాదించుకుంటున్నాడు. ముని 3 సినిమాలో లారెన్స్ బిజీగా వున్న సంగతి తెలిసినదే


