మురుగదాస్ సినిమాలో.. లక్ష్మి రాయ్!

మురుగదాస్ సినిమాలో.. లక్ష్మి రాయ్!

Published on Mar 31, 2015 1:17 PM IST

muragadass
కొత్త కథాంశాలనే సున్నితమైన భావోద్వేగాలతో, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించే దర్శకుల్లో ఒకరు.. ఏ. ఆర్. మురుగదాస్. తన కథలతో కేవలం తమిళంలోనే కాక తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో కూడా తానేంటో నిరూపించుకున్నారు. తమిళంలో ‘కత్తి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత ఇప్పుడు హిందీలో ‘అకిరా’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె తండ్రి శత్రఘ్ణ సిన్హా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్ళింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమాలో అందాల భామ రాయ్ లక్ష్మి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఆమెతో కొన్ని సన్నివేశాల్లో నటింపజేశారు. ఈ విషయాన్ని లక్ష్మి రాయ్ స్వయంగా తెలిపింది. సమకాలీన అంశాలతో, బలమైన కథాంశంతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అకిరా అన్న పేరు పర్ఫెక్ట్ సరిపోతుందని ఆ పేరును సెలెక్ట్ చేశారు. అకిరా అంటే మంచి గుండె నిబ్బరం కలిగి ఉన్న వ్యక్తి అని అర్థం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు