నిర్మాణ రంగంలోకి దిగుతున్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ !
Published on Jun 23, 2018 8:36 am IST

తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ కూడ కీలకంగా మారింది. ఆ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ లో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న సంస్థల్లో నిర్వాణ సినిమాస్ కూడ ఒకటి. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి, ఆ !, కంచె, ఆనందో బ్రహ్మ, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఇటీవలే ‘సమ్మోహనం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్ని పంపిణీ చేసిన ఈ సంస్థ కొత్తగా నిర్మాణ రంగంలోకి సైతం అడుగుపెట్టింది.

ఈ సంస్థ నిర్మించనున్న మొదటి సినిమా ఈరోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్ర దర్శకుడు ఎవరు, నటీ నటులెవరు, సినిమా ఎలా ఉండబోతోంది వంటి వివరాలు ఈరోజు తెలియనున్నాయి. మరి డిస్ట్రిబ్యూటర్లుగా మంచి సినిమాల్ని అందిస్తూ వచ్చిన ఈ సంస్థ నిర్మాణంలో ఎలాంటి అభిరుచిని ప్రదర్శిస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook