బిగ్ బాస్ కి తలనొప్పిగా మారిన లీకులు.

Published on Aug 6, 2019 2:31 pm IST

బిగ్ బాస్ 3 అత్యంత ప్రజాదరణతో విజయపధంలో దూసుకుపోతుంది. మిగతా ఏ బుల్లితెర కార్యక్రమం అందుకొనలేని టీఆర్పీ రేటింగ్స్ ఈ రియాలిటీ షో అందుకోవడం విశేషం. ఐతే బిగ్ బాస్ షో నుండి వెలువడుతున్న లీకులు బిగ్ బాస్ షో నిర్వాహకులను ఒకింత నిరాశకు గురిచేస్తున్నాయి. ప్రతి ఆదివారం బిగ్ బాస్ ఇంటి సభ్యుల నుండి ఒకరు ఎలిమినేట్ కావడం జరుగుతుంది. ఐతే ఈ ఎలిమినేషన్ విషయంలో ముందుగా వస్తున్న ఉహాగానాలే నిజం కావడం గమనార్హం. మొదటివారం నటి హేమ ఎలిమినేట్ కాబడుతున్నారని దాదాపు అన్ని ప్రముఖ మాధ్యమాలతో పాటు,సోషల్ మీడియాలో ప్రచారం కావడం జరిగింది. అందరూ ఊహించినట్టే హేమ షో నుండి వెళ్లిపోయారు.

రెండవ వారం ఎలిమినేషన్ విషయంలో కూడా వితికా, టీవీ9 జాఫ్ఫర్ పేరు ప్రముఖంగా వినిపించగా, ఎలిమినేషన్ కి ముందు రోజు ఖచ్చితంగా జఫ్ఫారే ఎలిమినేట్ కాబోతున్నారంటూ న్యూస్ బయటికొచ్చింది. వాస్తవంగా అదే జరగడం మనం చూశాం. దీనివలన సమాచార మాధ్యమాలు,సోషల్ మీడియా అనుసరించేవారికి ఎలిమేషన్ విషయంలో ఎటువంటి ఆసక్తివుండటం లేదు.

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన బిగ్ బాస్ సెట్ లో ఈ రియాలిటీ షో షూటింగ్ జరుగుతుంది. ఎంత గోప్యంగా షో నిర్వహిస్తున్నప్పటికీ సిబ్బంది ద్వారానో మరో విధంగానో న్యూస్ ముందుగానే బయటకి రావడం జరుగుతుంది. ఆదివారం ప్రసారం అయ్యే ఈ షో ముందుగానే షూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఎలిమినేట్ కాబడుతున్నారు అనేది ముందుగానే తెలిసిపోతుంది.

సంబంధిత సమాచారం :