హేమమాలిని పై నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ !

Published on Jul 14, 2019 11:47 am IST

పార్లమెంట్ సభ్యురాలైన సీనియర్ నటి హేమ మాలిని ప్రస్తుతం నెటిజెన్స్ ఓ ఆటాడుకుంటున్నారు.నిన్న ఆమె చేసిన ఓ పని ఆమెను సోషల్ మీడియాలో
అభాసుపాలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఎంపీ హేమమాలిని నిన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పార్లిమెంట్ పరిసరాలలో ఉన్న చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. ఆ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ కావడం జరిగింది. హేమమాలిని కి సరిగా చీపురు పట్టుకోవడం కూడా చేతకాలేదు. ఆమె చీపురుతో రోడ్ ఊడుస్తున్న విధానం చాలా ఫన్నీ గా ఉండటంతో నెటిజెన్స్ ఆమె పై సెటైర్లు మొదలుపెట్టారు.

“హేమమాలిని గారు ఊడుస్తూ కాస్ట్లీ రోడ్ ఎక్కడ పాడవుతుందో అని భయపడుతున్నారు”, అని ఒక నెటిజన్ ట్వీట్ చేస్తే మరొకరు హేమమాలిని గారు గాలిలో ఉన్న పోల్ల్యూషన్ ని పాకిస్తాన్ వైపు మళ్ళిస్తుంది”అని సెటైర్ వేశారు. మరొకరు” మీరు వీడియో కొరకు ఊడుస్తున్నారా లేక ప్రజలకు ఏమైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ఊడుస్తున్నారా” అని ట్వీట్ చేసారు. ఇలా నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ తో పాటు,ఫోటోలు పెట్టి ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More