
లెజెండరీ దర్శకుడు పద్మ శ్రీ కె. విశ్వనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుంది. ‘విశ్వదర్శనం’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నిఈరోజు విశ్వనాధ్ గారు లాంచ్ చేశారు. జనార్దన మహర్షి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో విశ్వనాధ్ గారి పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.
ఇక ‘శంకరాభరణం , సిరిసిరి మువ్వ, సాగరసంగమం’లాంటి ఎన్ని అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన విశ్వనాథ్ గారు తెలుగు చిత్ర సీమకు ఎనలేని సేవ చేశారు.